నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని బుస్సాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సుంకరి సారమ్మ కుటుంబానికి ఆదివారం శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ కమిటీ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు ట్రస్ట్ చైర్మన్ బాద్షా నాగ రమేష్ దృష్టికి ఈ సమస్య రాగా వెంటనే స్పందించిన రమేష్ తన సభ్యులతో కలిపి 25 కేజీల బియ్యము నిత్యవసర వస్తువులను అందించారు. ముందు ముందు కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకునేందుకు ఫస్ట్ సభ్యులు అందుబాటులో ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోవిందరావు పేట శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ కమిటీ సభ్యులు ఈసం లావణ్య, పెరుమళ్ళ భాగ్యలక్ష్మి, అరిగిన శ్రీలత, చిడెం రజిత, సుంకరి రాజ్యలక్ష్మి, బుద్దుల పైడి, పాలెం యాదగిరి, వడ్లకొండ శంకరయ్య, పోలెబోయిన సమ్మయ్య, పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 05:32PM