నవతెలంగాణ డిచ్ పల్లి
తెలుగు అధ్యయనశాఖ, తెలంగాణ యూనివర్సిటీ హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో డా. వంగరి త్రివేణి, అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు అధ్యయనశాఖ, తెవివి రచించిన మూడు వ్యాససంపుటాలు అరుగు, బటువు, భరిణఁ అనే పుస్తకాల అంకితోత్సవం - పరిచయ సభ హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్, నిజామాబాద్ లో ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు . అరుగుఁ అనే పుస్తకాన్ని ఇందూరు యజ్ఞ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. మూడ నాగభూషణం గుప్త కి, బటువు పుస్తకాన్ని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ కి, భరిణఁ పుస్తకాన్ని డిచ్ పల్లి మాజి ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహిళా సహకార అభివృద్ధి కార్పోరేషన్ చైర్ పర్సన్, ఆకుల లలిత రఘవెందర్ లకు అంకితం చేశారు.
సభాధ్యక్షత వహించిన ప్రొఫెసర్ డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ భారతీయ ఆత్మను ప్రతిఫలింపజేసె రచనలు ప్రగతికి మార్గదర్శనం చేస్తాయని, సాహిత్యవిమర్శ సాహిత్యలోతులను సహృదయులకు అందిస్తుందనీ, డాక్టర్.త్రివేణి రాసిన మూడు పుస్తకాలు అరుగు ఆదరణకు, బటువు బంధానికి, భరిణ ఆత్మీయతకు ప్రతీకలని వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూన్నారు.
విశిష్టాతిథిగా పాల్గొన్న నగర మేయర్ దండు నీతూకిరణ్ మాట్లాడుతూ స్త్రీ చైతన్యం ను చాటి చెప్పేవిధంగా డాక్టర్.త్రివేణి రచనలు ఉన్నాయని, సాహిత్య సృజనతో సమాజ వికాసానికి రచయితలు గొప్పకృషిని చేస్తున్నారన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి. రవీందర్, మాట్లాడుతూ ప్రజల భాషలో రాసిన రచనలు పదికాలాలు నిలబడుతాయని, త్రివేణి, తెలంగాణ యూనివర్సిటీ కీర్తిని పెంచేవిధంగా రచనలు చేస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు.
ఆత్మీయ అతిథి ఘనపురం దేవేందర్, అధ్యక్షులు, హరిదా రచయితల సంఘం, నిజామాబాద్ మాట్లాడూతూ సాహిత్య సృజన అధ్యాపకత్వం కార్యకర్తగా మూడు కోణాలలో త్రివేణి కృషి అపారంగా చేస్తున్నారన్నారు. అంకితంగా గ్రహించిన ఆకులలలిత మాట్లాడుతూ, స్త్రీలు ఇంకా అన్నిరంగాలలో రాణించాలని, త్రివేణి ఆదర్శమార్గదర్శి అని అన్నారు. రచయిత్రి త్రివేణి స్పందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలన్నారు.
అరుగు అనే పుస్తకాన్ని డాక్టర్. కాసర్ల నరేశ్ రావు, బటువు అనే పుస్తకాన్ని గోశిక నరసింహ స్వామి, భరిణ అనే పుస్తకాన్ని డాక్టర్. శారదా హన్మాండ్లు పుస్తకాలను పరిచయం చేశారు. అంకితోత్సవం తీసుకున్న మూఢనాగభూషణం గుప్త, ఆకుల లలితను డాక్టర్.త్రివేణి కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కవులు వి.పి. చందన్ రావు,పంచరెడ్డి లక్ష్మణ్, మేక రామస్వామి, సాయిబాబు, పొద్దుటూరి మాధవీలత, తొగర్ల సురేశ్, చింతల శ్రీనివాస్,దస్తగిరి, గంట్యాల ప్రసాద్ ,శంక, పద్మావతి, డా. సాయిలక్ష్మి ,పురంశంకర్ ,గనిషెట్టి రాములు, నారావేంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 05:53PM