నవతెలంగాణ-డిచ్ పల్లి
ల్లిఇందల్ వాయి మండలంలోని తిర్మన్ పల్లి గ్రామంలో మూడు పోలింగ్ స్టేషన్లో 18 సంవత్సరాలు కలిగిన యువతీ యువకులకు ఓటర్ నమోదు కార్యక్రమం ఆదివారం రేండో రోజు అధికారులు సందర్శించి తనిఖీలను నిర్వహించి వివరాలను బిఎల్ఓ లను అడిగి తెలుసుకుని, పలు సూచనలు సలహాలు అందజేశారు. ఓటు గుర్తింపు కార్డుకు ఆధార్ కార్డు లింక్ ఎంత శాతం సీడింగ్ అయిందని అడిగి తెలుసుకున్నారు. మిగిలిన వివరాలు జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, టివి రోజా నిజామాబాద్ 100%శాతం ఓటు సిడింగ్ జరిగే విధంగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం సువర్ణ, ఎంపిటిసి చింతల దాస్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, కరోబర్ నరేందర్, అంగన్వాడీ కార్యకర్తలు వనజా, అసిఫ శారదా, కవిత, రాధక తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 06:21PM