- మాదిగ జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షులు అంబాల మురళి
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఈ నెల 12 13 తేదీలలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మాదిగ జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షులు అంబాల మురళి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పసర గ్రామంలో మాదిగ జేఏసీ విద్యార్థి సంఘం నాయకుడు పరునందుల స్టాలిన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబాల మురళి హాజరై మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. మాదిగల హక్కుల కోసం చట్టాల పరిరక్షణ కోసం రిజర్వేషన్ అమలు కోసం మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెడమర్తి రవి పిలుపు మేరకు ఈనెల 12 ,13 తేదీలలో జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ ములుగు జిల్లా యువజన అధ్యక్షుడు ఈరెల్లి ప్రదీప్ మండల నాయకులు గంగారపు అన్వేష్, దుప్పటి మహేష్, జెమిని రవి, గజ్జల రాజేష్, రామస్వామి, మున్నా ప్రసాద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 06:24PM