- గోసంగి రాజకీయ శిక్షణ తరగతుల్లో సీనియర్ న్యాయవాది అడ్లురి శ్రీనివాస్
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లాలోని బైపాస్ రోడ్డులో గల గోసంగి సంఘ భవనంలో ఏర్పటుచేసిన గోసంగిలకు రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన దిశ కమిటీ సభ్యులు, సీనియర్ న్యాయవాది అడ్లూరీ శ్రీనివాస్ మాట్లాడుతూ గోసంగి లు రాజకీయంగా ఎదగాలని అప్పుడే రిజర్వేషన్ ఫలాలు, సంక్షేమ పథకాలు అందిపుచ్చుకుంటరాని రాజకీయాల్లోకి రాని కులం పతనానికి నిదర్శనం అని మహనీయులు అన్న మాటలు గోసంగిలు గుర్తు చేసుకోవాలనీ అన్నారు. జిల్లా గోసంగి సంఘం అధ్యక్షులు గంధం రాజేష్ మాట్లాడుతూ గోసంగిలు రాబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేల జిల్లా గోసంగి సంఘం ప్రోత్సహిస్తుందని దానికి ఇప్పటి నుండి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నిరగొండ బుచ్చన్న, ఎస్సి ఉప కులాల జిల్లా అధ్యక్షులు గంధం బుద్దిరాజు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పరశురామ్, జిల్లా గోసంగి ప్రదానకార్యదర్శి రాసరి నరేష్, నాయకులు పత్రీ సురేష్, గంధం పురుషోత్తం, ఈర్ణల వెంకట రమణ, గంధం ఆనంద్, కొండపల్లి రమేష్, కొండపల్లి పోశెట్టి, డొక్కా సాయిబాబు లతో పాటు పెద్ద సంఖ్యలో గోసంగి నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 06:31PM