నవతెలంగాణ- తాడ్వాయి
ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని నెలకోల్పెందుకు మానవ హక్కుల వేదిక కృషి చేసిందని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు బిఎస్ కృష్ణ అన్నారు. ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కామారంలో తుడుందెబ్బ, ఆదివాసి విద్యార్థి సంఘం, తుడుందెబ్బ మహిళా సంఘం, ఆదివాసీ సంక్షేమ పరిషత్, బిర్సా ముండా రీసెర్చ్ సెంటర్, పీసా కోఆర్డినేషన్ కమిటీ, ఆదివాసి ఉద్యోగుల సంఘం, మొదలకు ఆదివాసి సంఘాల సహకారంతో మానవ హక్కుల వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా బి ఎస్ కృష్ణ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించినట్లే ప్రతి వ్యక్తికి మంచి విలువలు ఉన్న హక్కులు కల్పించలేకపోయాయని, ఆనాడు బిఆర్ అంబేద్కర్ అన్నట్లు తెలిపారు. స్ఫూర్తిని కలిగించే ఎంతోమంది మహానుభావుల ఆశయాలు మనకి ఆస్తిగా ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోలేకపోతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు మానవహక్కుల సంఘానికి చెందిన సభ్యులు మాట్లాడారు. ఆదివాసి సమస్యలపై, పోడు సమస్యలపై కూలంకషంగా చర్చించారు. అన్ని సంఘాలు ఏవిగ్రీవంగా కొన్ని ఆదివాసి పోడు వ్యవసాయం, విద్యా ఉద్యోగం, ఏజెన్సీ సమస్య, 100% రిజర్వేషన్లు తదితర సమస్యల పైన ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంగం సభ్యులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ తిరుపతయ్య, బాదావత్ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి మై పార్టీ అరుణ్ కుమార్, తుడుం దెబ్బ నాయకులు పోడెం రత్నం, భాగ్యలక్ష్మి, ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పోదెం కృష్ణ ప్రసాద్, రేగ నరేందర్ కుమార్, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు దెబ్బకట్ల సుమన్, ప్రభాకర్, హరికృష్ణ, వేగ నరసయ్య గొప్ప సమరావు, 200 మంది ఆదివాసి, తుడుందెబ్బ, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.