నవతెలంగాణ-గోవిందరావుపేట
లక్నవరం పర్యాటక కేంద్రం ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. సెలవు దినం కావడంతో హైదరాబాద్ కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు.
లక్నవరంలో బోటు షికారు కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి పర్యాటకులకు ఎదురైంది.
అంతులేని విధంగా వాహనాలు రావడంతో ఒక దశలో బుసాపురం టూ లక్నవరం రహదారి వాహనాలతో
బిజీగా మారిపోయింది. వేలాడే వంతెనలు రెండు సైతం పర్యాటకులతో కిటకిటలాడాయి. స్పీడ్ బోట్లు షికారు చేసేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపించారు. పిల్లల కోసం ఏర్పాటుచేసిన బ్యాటరీ వీలర్లపై చిన్నారులు కేరింతలు కొట్టారు. వచ్చే క్రిస్పస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవు దినాల్లో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న పర్యాటకులకు అనుగుణంగా వసతి సౌకర్యాలను సమ కూర్చడంలో పర్యటక శాఖ విఫలమైందని పర్యాటకులు తెలుపుతున్నారు. ముందు ముందు అత్యధికంగా సెలవు దినాలు ఉన్న నేపథ్యంలో పర్యటకుల తాకిడి పెరుగుతున్న పరిస్థితిని అంచనా వేసి అందుకు అనుగుణంగా అవకాశాలను అవసరాలను పరిగణలోకి తీసుకొని ఏర్పాట్లను చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 06:38PM