- 18 సంవత్సరాలు నిండిన నమోదు చేయాలి
హుజురాబాద్ ఆర్డీవో హరిసింగ్
నవతెలంగాణ-వీణవంక
ఓటరు నమోదు ప్రక్రియను వేగిరం చేయాలని హుజురాబాద్ ఆర్డీవో హరిసింగ్, తహసీల్దార్ దండిగ రాజయ్య సూచించారు. మండలంలోని పలు పోలింగ్ బూత్‌లను వారు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియ, బీఎల్‌వోల పనితీరును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటరు నమోదును సక్రమంగా నిర్వహించాలని బీఎల్‌వోలకు సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరిని ఓటు నమోదు చేసే విధంగా చూడాలని సూచించారు. ఇందుకోసం ఫారం-6, ఇదివరకే ఉన్న ఓటులో చేర్పులు-మార్పులు ఉన్నట్లయితే ఫారం-08ను వినియోగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఐలు గోనెల రవీందర్, ప్రవీణ్, బూత్ లెవల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 06:44PM