- స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి తమ గోడును (బాధను) వెళ్ళబోసుకున్న మహిళా ఉపాధ్యాయినీలు
నవతెలంగాణ-కంటేశ్వర్
భార్యాభర్తలిద్దరూ ఒక దగ్గర పని చేస్తేనే ఉత్పాదకత పెరుగుతుంది అని సీఎం కేసీఆర్ పలుమార్లు అసెంబ్లీ సాక్షిగా పేర్కొనడం జరిగింది. జీవో నెంబర్ 317 అమల్లో భాగంగా భార్యాభర్తలను ఒకే దగ్గర ఉంచేలా చర్యలు తీసుకోమని సీఎం కేసీఆర్ సూచించారు. కానీ 19 జిల్లాల్లో భార్యాభర్తల బదిలీలకు అవకాశం ఇచ్చి 13 జిల్లాలను బ్లాక్ లో పెట్టడం ఉంచారు. అందులో మన నిజామాబాద్ జిల్లా కూడా ఒకటి. అవసరమైన ఖాళీలు అందుబాటులో ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లాను బ్లాక్ లో ఉంచడం వల్ల తాము గత 11 నెలలుగా తీవ్ర మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతున్నామని, కుటుంబాలకు దూరంగా ఇల్లు, పిల్లల బాగోగులు చూసుకోలేక వృద్ధులైన తల్లిదండ్రులను, అత్తమామలను పట్టించుకోనే అవకాశాలు లేక నరకయాతన పడుతున్నామని, కుటుంబాలకు దూరమైన మేము బోధనపై కూడా సరైన దృష్టి సారించలేకపోతున్నామని, ప్రతిరోజు 100 నుండి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి విధులకు హాజరు కావాల్సి వస్తుందని, అనారోగ్య కారణాలవల్ల విధులకు హాజరు కాలేక మహిళా ఉపాధ్యాయులు మెడికల్ లీవ్ లో పెట్టుకునే పరిస్థితి ఉందని దయచేసి తమరు మా సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలియజేసి మమ్మల్ని ఈ నరకకూపం నుండి బయటపడేయాలని మహిళా ఉపాధ్యాయులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ని వేడుకున్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు స్పందిస్తూ తక్షణమే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి ఫోన్ కాల్ చేసి భార్యాభర్తల బదిలీల గురించిన సమస్య గురించి ఆరా తీశారు మీ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మనోజ, విజయలక్ష్మీ, చంద్రకళ, శ్రీలత, నరేష్, సుధాకర్, సమద్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 06:50PM