నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాదు జిల్లా పద్మశాలి మహిళా సంఘం, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి సంయుక్త ఆద్వర్యంలో ఆదివారం నిజామాబాదు నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా బాసర అఖిల భారత పద్మశాలి నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడు రాపోలు సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వధూవరుల పరిచయ వేదికలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. పరిచయ వేదిక కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు. పద్మశాలీలు వివాహాలు చేసుకుంటే బాసరలోని పద్మశాలి అన్నసత్రంలో వివాహ వేదికతో పాటు ఉచితంగా బోజన సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా వంద మందికి పైగా వధూవరులు పరిచయం చేసుకున్నారు. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు దీకొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి పుల్గం హన్మాండ్లు, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు గుడ్ల చంద్రబాగ, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షుడు రాపెల్లి గురుచరణ్, నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట్ నర్సయ్య, యువజన సంఘం గౌరవాద్యక్షులు డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్, అద్యక్షులు మెరుగు నాగరాజ్, బిజ్జు దత్తాద్రి, డాక్టర్ సత్యనారాయణ, గంట్యాల వెంకట్ నర్సయ్య, కైరంకొండ విఠల్, గుడ్ల భూమేశ్వర్, బింగి మోహన్, గుండయ్య, సిలివేరి గణేష్, మచ్చ చంటయ్య, చింతల గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 06:54PM