- ఖమ్మం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారులు అర్ధమర్చిన సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించిన అధికారులు
నవతెలంగాణ-కంటేశ్వర్
ఖమ్మం జిల్లా ఫారెస్టు రేంజ్ అధికారిని హతమార్చిన సందర్భంగా నివాళులు అర్చించి, ఫారెస్టు సిబ్బందికి భరోసా పోలీస్ కమీషనర్ కే ఆర్ నాగరాజు సోమవారం అందించారు. ఈనెల తేది: 22-11-2022 నాడు ఖమ్మం జిల్లాలో ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్ రావుని గుత్తికోయలు హతమార్చడం జరిగింది. ఇందులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది అందరూ కలిసి జిల్లా ఫారెస్టు కార్యాలయంలో ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్ రావు చిత్రపటానికి పువ్వూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, 2 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది.
అనంతరం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్. మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్న నిజామాబాద్ రేంజ్, వర్ని రేంజ్, కమ్మర్పల్లి రేంజ్, సిరికొండ రేంజ్, ఆర్మూర్ రేంజ్ పరిధిలోగల ఫారెస్టు సిబ్బంది వారి అటవిప్రాంతాలలో విధులు నిర్వహిస్తుంటారు. వారికి విధినిర్వహాణలో ఎలాంటిహాని జరగకుండా పోలీస్ శాఖ వారి రక్షణ కోసం భరోసా కల్పిస్తామని అన్నారు. ఎవ్వరి ఎలాంటి హాని జరుగకుండా పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని, ఎళ్లవేలల మీకు తోడు ఉంటామని అటవి శాఖకు 24 x7 గా మీకు భద్రతా కల్పిస్తామని, అందుకుగాను నిజామాబాద్ అటవిశాఖకు పూర్తి స్థాయి భరోసా ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు, జిల్లా అటవి శాఖ అధికారి వికాస్ మీనా, ఐ.ఎఫ్.ఎస్., నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఎ.సి.పిలు ఎ. వెంకటేశ్వర్, ఆర్. ప్రభాకర్ రావు, కె.ఎమ్. కిరణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీశైలం, సి.ఐలు ఎస్.ఐలు, ఫారెస్టు డివిజినల్ అధికారులు, అటవి శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 05:32PM