- తహసిల్దార్ శ్రీనివాస్ రావు
నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్ పుర్ లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన ఓటరు నమోదు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసిల్దార్ పి.శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. కళాశాల విద్యార్థులు, నూతన ఓటర్లుగా 17 సంవత్సరాల వయస్సు పూర్తయి, 18 వ సంవత్సరం లో చేరిన వారు పామ్ 6 ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు గురించి, ఓటు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ చంద్ర విట్టల్ మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా అర్హత గలవారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు చాలా విలువైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ అశ్విని, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి సి నరసింహ రెడ్డి, కళాశాల అధ్యాపకులు బి విజయ, వై నారాయణ, ఫణి కుమార్, అర్చన, మురళి, ప్రవీణ్ కుమార్, తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 05:36PM