నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని ఎనబుర గ్రామస్తులు తమ గ్రామ దేవతలైన పోచమ్మ, లక్ష్మమ్మ, ఉరడమ్మా దేవతల గుడిలను నిర్మించి అలాగే కొత్త విగ్రహాలను తెచ్చి గ్రామ ప్రజలు అందరూ కలిసి తమ సొంత ఖర్చులతో విగ్రహం ప్రతిష్టాపన చేపట్టారు. ఈ కార్యక్రమం రెండు రోజులపాటు ఎంతో ఘనంగా జరిగాయి. మొదటిరోజు పందిరి వేయుట, పూజలు, హోమం వంటి కార్యక్రమాలు జరిగాయి. రెండవ రోజు అభిషేకం, విగ్రహ ప్రతిష్టాపన, బోనాలు, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గ్రామ వీధుల గుండా భక్తులు, పెద్ద ఎత్తునమహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు, యువకులు గ్రామ ప్రజలు అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఐక్యమత్యమే మహాబలం అన్న పదానికి అనుగుణంగా ఊరి ప్రజలందరూ ఒకే మాటపై కలిసి కట్టుగా మొదట అనుకున్న మూడు నెలల కాలంలోనే గుడిలను నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన ఎంతో ఘనంగా నిర్వహించామని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీ 108 మల్లికార్జున స్వామి ఖడ్గం మటసంస్థాన్ ఆధ్వర్యంలో ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. అన్ని తానై ముందుండి నడిపించిన స్వామి గారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామ పెద్దలు పిల్లలు, వృద్దులు, మహిళలు, యువకులు, పెద్ద ఎత్తున భక్తులు మరియు గ్రామ ప్రజలు అందరు కలిసి సంతోషంగా భక్తిశ్రద్ధలతో ఎంతో ఘనంగా నిర్వహించామని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 05:40PM