- సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ-కంటేశ్వర్
సామాజిక అంతరాలు తగ్గాలి అని ఉద్యమాలు సాగించినప్పుడే జ్యోతిబాపూలే ఆశయాలు నెరవేరుతాయి అని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు సోమవారం జ్యోతిబాపూలే 132 వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పూలదండలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అణగారిన కులాల పేరుతో వివక్షత పాటిస్తూ శ్రమ దోపిడీ జరగటాన్ని తట్టుకోలేక సామాజిక ఉద్యమాలు నిర్వహించారని వివక్షతను ఎదిరించటానికి ప్రజల్లో విద్య అవగాహన లేకపోవడం వల్ల వారిలో సామాజిక చైతన్యం తేవడం కోసం ప్రారంభించి చదువు నేర్పించడంతోపాటు అనేక సామాజిక ఉద్యమాలను నిర్వహించారని, ఈ వ్యవస్థలో ఉన్న దోపిడీ నిర్మూలన జరగాలంటే మనువాద సిద్ధాంతాన్ని ఆచరిస్తూ సామాజిక అంతరాలు కొనసాగాలని కోరుకునే ఆలోచ నతో పరిపాలన కొనసాగిస్తున్న బిజెపి నుంచి అధికారం నుంచి దూరం చేయగలిగినప్పుడు కొంతైనా ప్రజలకు ఉపశమనం కలుగుతుందని ఆయన అన్నారు. మానవ శ్రమకు తగిన ఫలితం అందినప్పుడే ఈ వివక్షత అంచివేత తగ్గుతుందని అన్నారు. అప్పుడే పూలే ఆశయాలను నెరవేర్చిన వాళ్ళమవుతామని అందుకు ఉద్యమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్ మరియు విశాల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 05:45PM