నవతెలంగాణ-కంటేశ్వర్
మార్చ్ 5, 2022 న వై.సుదర్శన్ రావ్, పి.సి 1768, ముగ్పల్ పి.యస్ మరణించడం జరిగింది. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సెన్స్ రూపంలో గల చెక్కు రూ॥ 5,10,000/- ( ఐదు లక్షల పది వెయిల రూపాయల చెక్కును సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్. చేతుల మీదుగా వై.సుదర్శన్ రావ్ సతీమణి అయిన వై. శోభారాణి కి చెక్కును సోమవారం అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా నిజామాబాద్ పరిపాలన అధికారి (ఎ.ఓ ) రామారావు, ఆఫీస్ సూపరింటెండెంటు మక్సూద్ హైమద్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, భద్రతా సెక్షన్ఇంచార్జీ పి. రాజేశ్వర్ వారికుటుంబ సభ్యులు హాజరుకావడం జరిగినది.
Mon Jan 19, 2015 06:51 pm