- విద్యాశాఖ అధికారి రాజ గంగారం
నవతెలంగాణ-డిచ్ పల్లి
డిసెంబరు 5,6 తేదీలలో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ఇన్స్పైర్ నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారి రాజ గంగారం సోమవారం తెలిపారు. టెక్నాలజీ అండ్ టాయ్స్ అనే ప్రధాన అంశంలో ఏడు ఉప అహంశాలలోనూ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ అనగా రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఉప అంశాలు అడ్వాన్స్మెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, హెల్త్ అండ్ క్లీన్లినెస్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్నోవేషన్, ఎన్విరాన్మెంటల్ కన్సర్, హిస్టారికల్ డెవలప్మెంట్ విత్ కరెంట్ ఇన్నోవేషన్, మ్యాథమెటిక్స్ ఫర్ యు పై ఉపాంశాలతో పాటు ఇంకేదైనా సామాజిక ప్రయోజనంతో కూడిన ప్రదర్శనలను గైడ్ టీచర్లు విద్యార్థులతో చేయించి జిల్లాస్థాయి ప్రదర్శనలు పాల్గొనాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాలను ప్రతి అప్పర్ ప్రైమరీ హై స్కూల్, కేజీబీవీ, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు అన్ని మేనేజ్మెంట్లు తప్పనిసరిగా తమ ఎగ్జిబిష్లను ప్రదర్శించేటట్లు ప్రధాన ఉపాధ్యాయులు శ్రద్ధ వహించవలనని మండల విద్యాశాఖ అధికారి రాజ గంగారం కోరారు. ఈ కార్యక్రమంలో సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అను అంశంలో సెమినార్ ను కూడా నిర్వహించడం జరుగుతుందని, 2021 22 సంవత్సరానికి మంజురైన 83 ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన కూడా ఇదే తేదీలో జిల్లా కేంద్రంలోని ఎస్ ఎఫ్ ఎస్ పాఠశాల సుభాష్ నగర్ లో నిర్వహించడం జరుగుతుందని, ఎస్సీఈఆర్టీ మార్గదర్శకలకు అనుగుణంగా ప్రదర్శనలు తయారు చేసుకోవాలని అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులను, గైడ్ టీచర్లను కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 05:51PM