నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని బుసాపురం గ్రామంలో నెలకొన్న సమస్యలపై సోమవారం ఐటీడీఏ ఏపీవో వసంతరావు కలిసి వినతిపత్రం అందించినట్లు సర్పంచ్ సింగం శ్రీలత చంద్రయ్యలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీలత మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో గతంలో ఇచ్చిన ఇండ్ల ప్లాట్లలో ట్రైబల్స్ కు సంబంధించిన కొంతమందికి రిజిస్ట్రేషన్ ఆగిపోవడం జరిగిందని ఆ విషయమై వెంటనే పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. అంతేకాక గ్రామంలో నిత్యావసర వస్తువుల సరఫరా రేషన్ డీలర్ షిప్ ట్రైబల్ వికలాంగులకు కేటాయించాల్సి ఉండగా ఇప్పటివరకు నాన్ ట్రైబల్స్ ఈ డీలర్ షిప్ ను నిర్వహిస్తున్నారు. అర్హులైన వికలాంగ ట్రైబల్స్ కు ఈ డీలర్ షిప్ ను అందించాలని అందు కొరకు గిరిజన యువకులు పలుమార్లు కోరడం జరిగిందని అన్నారు. గ్రామంలో అంగన్వాడీ టీచర్ లేకపోవడం వల్ల అంగన్వాడి సెంటర్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అపరిస్కృతంగా ఉన్న అంగన్వాడి టీచర్ ఖాలిని వెంటనే భర్తీ చేసి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు న్యాయం జరిగే విధంగా సహకరించాలని కోరినట్లు తెలిపారు.
అదేవిధంగా గ్రామంలో ఆర్ ఓ ఎఫ్ ఆర్ కార్యక్రమంలో భాగంగా సుమారు 160 మంది పోడు సాగుదారులు వీరిలో వందకు పైగా ట్రైబల్ సాగుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని ఏ ఒక్కరికి కూడా అర్హులుగా అటవీశాఖ ప్రకటించకపోవడం దురదృష్టకరమని అన్నారు. అంతేకాక గతంలో ఇచ్చిన 35 మందికి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఉన్నప్పటికీ వాటిని కూడా రిజెక్ట్ చేస్తున్నామంటూ అటవీ అధికారులు సమావేశంలో చెప్పడం జరిగిందన్నారు. నిజమైన కాస్టులో ఉన్న అందరికీ ఆర్ వై ఎఫ్ ఆర్ పట్టాలు అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. లక్నవరం టూరిజం పర్యాటక కేంద్రం ఈ ఏరియాలో ప్రసిద్ధి చెందిందని పారిశుద్ధ్య నివారణ కొరకు అనేక రకాల చర్యలు చేపడుతున్నామని పార్కింగ్ సౌకర్యం కోసం స్థలాన్ని కేటాయించాలని అధికారులను కోరడం జరిగిందన్నారు. విద్యార్థి సమస్యలపై ఐటిడిఏ పిఓ వెంటనే సంబంధించి గ్రామ అభివృద్ధి కోసం సహకరించాలని కోరినట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 06:03PM