నవతెలంగాణ-బెజ్జంకి
జిల్లా కేంద్రంలో ఈ నెల 21,22,23న జరగనున్న సీఐటీయు మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండల పరిదిలోని గుండారం గ్రామంలో సీఐటీయు మహాసభల కరపత్రాలతో కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీఐటీయు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm