- శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మాణానికి 50 లక్షలు రూ. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-కంటేశ్వర్
ఎమ్మెల్యే గణేష్ బిగాల విజ్ఞప్తి మేరకు నగరం లో వెంగల్ రావ్ కాలనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మాణానికి 50 లక్షల మంజూరు చేయించి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చేతుల మీదుగా సోమవారం చేశారు. వెంగల్ రావు కాలనిలో ముదిరాజ్ కులస్తులు ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మాణానికి భూమి పూజ ఎమ్మెల్యే బిగాల చేశారు.
1 కోటి 5 లక్షల రూ. తో 15 ముదిరాజ్ సంఘాల నిర్మాణానికి సి డి పి నిధులు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన ముదిరాజ్ సోదర సోదరీమణులు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల వెంగల్ రావ్ కాలనీ లో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో వెంగల్ రావు కాలని లొని పెద్దమ్మ తల్లి ఆలయం ఉంది. 1962 సంవత్సరం నుండి ఇక్కడ ముదిరాజ్ సోదర సోదరీమణులు పూజలు నిర్వహిస్తున్నారు. ముదిరాజ్ సోదర సోదరీమణులు చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది కావున కొత్త గుడి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు ఆలయాన్నీ పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి 50 లక్షల రూ.నిధులు మంజూరు చేయించడం జరిగింది. 50 లక్షల నిధులతో టెండర్లు పూర్తి చేసుకొని నేడు భూమి పూజ చేసుకున్నాము.
రెండు అంతస్థులతో ఆలయం నిర్మిస్తున్నాము. ఆలయానికి రావడానికి విశాలమైన రోడ్డు నిర్మాణం కూడా చేస్తున్నాము. నిజామాబాద్ నగరంలో అన్ని కులాల వారికి, మతాల వారికి సమానంగా నిధులు కేటాయిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాము. ముదిరాజ్ సంఘ భవనాల నిర్మాణం కొరకు ఒక సంఘానికి 7 లక్షల చొప్పున 15 సంఘాలకు 1 కోటి 5 లక్షల రూ.ల నిధులు నా యొక్క ఎమ్మెల్యే కోట సిడిపి నిధులు మంజూరు చేసాను. మరి కొన్ని సంఘాల వారు కూడా కొత్తగా స్థలం తీసుకున్నారని చెప్పారు వారికి కూడా నిధులు మంజూరు చేస్తాము. జాలిగం గోపాల్ ముదిరాజ్ ని జెండా బాలాజీ ఆలయ కమిటీ చైర్మన్ గా నీయమించాము. పిడుగు రవి రాజ్ ముదిరాజ్ ని జిల్లా కోర్టులో పి పి గా నీయమించాము. నిజామాబాద్ నగరం అభివృద్ధి తో పాటు సంక్షేమ పథకాలు ప్రజలకి చేరేలా కృషి చేస్తున్నాము. నగరాన్ని అధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు ఆలయాలు నిర్మిస్తున్నాము. హమాలి వాడి లో శ్రీ సంతోషి మాత సాయి బాబా ఆలయం, కోట గల్లిలో మార్కండేయ మందిరం నిర్మిస్తున్నాము. విటలేశ్వర ఆలయం,అయ్యప్ప ఆలయం కి శాశ్వత ఆదాయం వచ్చేలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాము. సాధ్యమైనంత త్వరలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించి భక్తులకు అందుబాటులో కి తీసుకవస్తామని మాటిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, వెల్డింగ్ నారాయణ, జాలిగం గోపాల్, రవి రాజ్, కరాటే రమేష్, సిర్ప రాజు కామారెడ్డి గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ టిఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు ముదిరాజ్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 06:11PM