నవతెలంగాణ-డిచ్ పల్లి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ అద్వ్యరంలో జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ కన్వీనర్ మనోజ్ పాల్గొని మాట్లాడుతూ అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడన్నరు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, సమాన హక్కులను అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చుని సూచించార న్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్య సమితి సభ్యులు మహేష్, యూనివర్సిటీ నాయకులు నవీన్, ప్రమోద్, సాయి, చక్రి, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm