- మద్దినేని తేజరాజు బిజెపి మండల అధ్యక్షుడు
నవతెలంగాణ-గోవిందరావుపేట
రైతులు పండించిన ధాన్యాన్ని వ్యాపారులు తరుగు తీయకుండా దిగుమతి చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మద్దినేని తేజ రాజు డిమాండ్ చేశారు. సోమవారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తేజ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని 20 రోజులు కావస్తున్న, తగినన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని, కాటా వేయబడిన వరి ధాన్యమును తరుగు పేరుతో కిలో నుండి ఐదు పది కిలోలు గతంలో తీశారు. ఈ సీజన్లో ఏమాత్రం తరుగు తీయకుండా వరి ధాన్యం కొనుగొలుచేయలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముకై రైతులను నట్టేట్ట ముంచోద్దని భారత భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరియు ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వము లక్ష రూపాయల రుణమాఫీని చేస్తామని ఇప్పటివరకు చేయలేదని తక్షణమే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
రైతులను తరుగు పేరుతో మోసం చేసినట్లయితే మిల్లర్లపై కొనుగోలు కేంద్రాలపై చట్టరీత్య చర్య తీసుకోగలరని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రైతులకు గన్ని సంచులను కొత్త వాటిని సప్లై చేసే విధంగా చూడాలని పాత గన్నేసంచులను పంపినట్లయితే దాని సాకు చూసి తరుగుగ మిల్లర్లు చూపిస్తారని కొత్త గన్నే సంచులను రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేసే విధంగా చూడాలని కోరినారు. రైతులను తరుగు పేరుతో మోసం చేసినట్లయ రైతు పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మహబూబాబాద్ నియోజకవర్గ కో కన్వీనర్ తక్కెళ్ళపల్లి దేవేందర్ రావు, ములుగు జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి, ములుగు జిల్లా ప్రచార కార్యదర్శి రుద్రారపు సురేష్, మెరుగు సత్యనారాయణ, కొత్త సుధాకర్ రెడ్డి ఎద్దునూరి రమేష్ అంతిరెడ్డి రమాదేవి, కందాల రవీందర్ రెడ్డి, రాజారపు రామచంద్రు, బొమ్మరబోయిన వీర బిక్షం, ఈక రాంబాబు, చలసాని ప్రవీణ్ మధుసూదన్ రెడ్డి, పన్నాల కర్ణాకర్ రెడ్డి, కందాల వెంకటరెడ్డి, ఏ.సునీత, ఏ .లలిత, రాఘవ వెంకన్న బర్ల సంజీవరెడ్డి యార్లగడ్డ నాగేశ్వరరావు, పసుల బాబురావు, వద్దుల చంటి తండా శ్రీనివాస్, ఇక రామస్వామి, కత్తుల కుమారస్వామి ఏ వాళ్య చుంచు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 06:21PM