నవతెలంగాణ-నవీపేట్
మండలంలోని తుంగిని యువకులకు మండల కేంద్రంలో కరుణన్న యువసేన ఆధ్వర్యంలో సోమవారం హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన హెల్మెట్ల ను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్లు లేని కారణంగా యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భాస్కర్ రాజ్, గణపురం రవి, తుంగిని గ్రామస్తులు రాజేశ్వర్, నాగభూషణ్ రావు, పోశెట్టి, రవి, ముత్యం తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm