-జీ పూర్ణచంద్రరావు. కెనరా బ్యాంక్ మేనేజర్
నవతెలంగాణ-గోవిందరావుపేట
రేపు మండలంలోని పసర గ్రామంలో పీఎస్ఆర్ ఫంక్షన్ హాలులో మహిళా సంఘాల సభ్యులకు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు కెనరా బ్యాంక్ పసర బ్రాంచ్ మేనేజర్ జి పూర్ణచంద్రరావు అన్నారు. సోమవారం కెనరా బ్యాంకు పసర బ్రాంచ్ కార్యాలయంలో మేనేజర్ పూర్ణచందర్ మీడియాతో మాట్లాడారు. మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అభివృద్ధి జరుగుతున్న క్రమంలో భాగంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక అభివృద్ధి కై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
| పొదుపు మరియు రుణాలు వాటి సద్వినియోగం సకాలంలో చెల్లింపులు బ్యాంకు సేవలు తదితర అంశాలపై మహిళా సంఘాల సభ్యులకు పూర్తి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఆర్డిఏ నుండి నాగ పద్మజ మరియు కెనరా బ్యాంకు వరంగల్ శాఖ ఏజీఎం మాధవి తదితరులు హాజరై మహిళా సంఘాల సభ్యులకు అనేక అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 06:26PM