నవతెలంగాణ-కంటేశ్వర్
జైలులో నిరుపయోగంగా ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ యందలి ఐరన్ స్క్రాప్ ను డిసెంబర్ 05 వ తేదీన జిల్లా జైలు ఆవరణలో వేలం వేయనున్నట్లు జిల్లా జైలు, పర్యవేక్షణాధికారి జి. ప్రమోద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనదలచినవారు నిర్ణీత ధరావతు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం జైలర్ ఎస్. రాజశేఖర్ రెడ్డి (95029 20267) ని సంప్రదించాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm