నవతెలంగాణ-కంటేశ్వర్
జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 24న కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలలో స్నేహ సొసైటీ అందుల పాఠశాల అంధ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి జిల్లా స్థాయిలో మొదటి స్థానం కైవసం చేసుకుని రాష్ట్రస్థాయిలో జరిగే దివ్యాంగుల ఆటల పోటీలకు ఎంపికయ్యారని, స్నేహ సొసైటీ రూరల్ రీకన్స్ట్రక్షన్ కార్యదర్శి సిద్దయ్య సోమవారం తెలిపారు. ఈ పోటీలలో మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలలో పాల్గొననున్నారు.
అక్షయ ఐదవ తరగతి వంద మీటర్ల పరుగు పందెం కు, సాయి జాన్వి ఐదవ తరగతి 50 మీటర్ల పరుగు పందెం కు, రాహుల్ ఏడవ తరగతి 50 మీటర్ల పరుగు పందెంకు, ఆసిఫ్ ఏడవ తరగతి జావలిన్ త్రో కి, ఇమ్రాన్ ఏడవ తరగతి షార్ట్ పుట్ కు, మహీం ఫాతిమా 9వ తరగతి షాట్ పుట్ జావలిన్ త్రోకు, సంతోష్ పదవతరగతి 100 మీటర్ల పరుగు పందెం షార్ట్ పుట్కు, అలాగే గంగోత్రి పదవ తరగతి షాట్ పుట్కు రాష్ట్రస్థాయిలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఎనిమిది మంది నవంబర్ 29 30 డిసెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి దివ్యాంగుల ఆటల పోటీలలో పాల్గొంటున్నారని ఈ పోటీలు లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారన్నారు. స్నేహ సొసైటీ పాఠశాల నుండి ఎనిమిది మంది ఎంపిక రాష్ట్రస్థాయిలోనూ మంచి ప్రతిభ కనబరచాలని ఈ సందర్భంగా స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి తెలిపారు. జిల్లాస్థాయి నుండి రాష్ట్రస్థాయి పోటీలకు వెళుతున్నందుకు విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలను తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 06:31PM