నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిదిలోని గుండారం ప్రభుత్వోన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులందజేసినట్టు బీఏస్పీ నాయకులు సోమవారం తెలిపారు. జ్యోతారావు పూలే వర్థంతి సందర్భంగా జ్యోతిరావు పూలే జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని పెద్దోల్ల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అనంతరం ప్రభుత్వోన్నత పాఠశాల భోధన సిబ్బందిని బీఎస్పీ నాయకులు శాలువా కప్పి సన్మానించారు.
Mon Jan 19, 2015 06:51 pm