నవతెలంగాణ-కన్నాయిగూడెం
మండలంలోని ఐలాపూర్ గ్రామంలో కన్నాయిగూడెం ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మరియు కాంటాక్ట్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏటూర్ నాగారం సిఐ రాజు హాజరయ్యారు. అలాగే ఐలాపూర్ గ్రామంలోని గుత్తి కోయ గుంపు వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ గూడెంలో ఏమైనా సమస్యలు ఎదురైతే పోలీసులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సిఆర్పిఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm