నవతెలంగాణ-గోవిందరావుపేట
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సభను సోమవారం మండలంలోని పసర ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఎంఎస్పి పార్టీ ములుగు జిల్లా ఇన్చార్జి ఇరుగుపైడి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేస నివాళులు అర్పించి మాట్లాడారు. పూలే ముందు నుండి నేటి వరకు భారతదేశ చరిత్రను అధ్యయనం చేయడంతోనే దేశంలో దోపిడి పాలన అంతం మొన్దించవచ్చని సమ సమాజ స్థాపన చేయించాలనే సత్యాన్ని బహుజన నాయకత్వం గుర్తించి ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. మతాల మధ్య విదేశాలను రెచ్చగొట్టే రాజకీయంగా లబ్బి పొంద రాజ్యాలు ఏరుతున్న ఆధిపత్య పార్టీల కుట్రలను బద్దలు కొట్టాల్సిన తరుణంలో ఉద్యమ నాయకత్వం వాస్తవ చరిత్ర ప్రజలకు తెలియజేస్తూ వర్తమానంలో పూలే లాగా శోధించి బోధించి లక్ష్యం చేరుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు. ఎలమర్ది శ్రీనివాసు. బుర్ర సోమన్న గౌడ్, కంచర్ల కృష్ణ ప్రసాద్ పటేల్, ఆషాడపుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 06:36PM