నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
రాష్ట్ర స్థాయి సంబరాలకు నలంద హైస్కూల్ విద్యార్థులు ఎంపిక జన విజ్ఞాన వేదిక (తెలంగాణ) సమగ్ర శిక్ష తెలంగాణ ప్రభుత్వ సహకారంతో జిల్లా స్థాయి చెకుముకి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శర్వాణి పదవతరగతి, సాత్విక్ 9తరగతి, మనోజ్ 8 తరగతి విద్యార్థులు ప్రథమంగా నిలిచి డిసెంబర్ 9,10,11 న జరిగే రాష్ట్రస్థాయి సంబరాలకు సిరిసిల్ల కు ఎంపికయ్యారు అని పాఠశాల అధ్యక్షులు అట్లూరి మరళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు సంగుమారి ప్రకాశం, ప్రధాన కార్యదర్శి ఇంగు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయిని పి.పద్మావతి విద్యార్థులను అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm