నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి, భిక్కనూర్ గ్రామాలలో కేంద్ర జనశక్తి అభియాన్ బృంద సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రం శివారులోని శ్రీ సిద్ద రామేశ్వర ఆలయ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పురాతన కోనేరును సందర్శించి మాట్లాడుతూ పురాతన కట్టడాలను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృంద సభ్యులు రజ్వి, సి బి సింగ్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎంపీడీవో అనంతరావు, పట్టణ సర్పంచ్ తునికి వేణు, ఉప సర్పంచ్ బోడ నరేష్, కేంద్ర సంఘ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.