నవతెలంగాణ-భిక్కనూర్
పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో వివిధ ఖాతాల పై సోమవారం మండలంలోని సిద్ధిరామేశ్వర్ నగర్ గ్రామంలో పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోస్ట్ ఆఫీస్ లో అమలవుతున్న వివిధ పథకాలను గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనగామ శ్రీనివాస్, ఎంపీటీసీ మీనా దుర్గ బాబు, ఉపసర్పంచ్ లతా సుధాకర్, పోస్టల్ సిబ్బంది,సెక్రెటరీ సౌజన్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm