నవతెలంగాణ-దుబ్బాక రూరల్
రైతన్నల సమస్యల పరిష్కారంకై దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెఱకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాకలో దీక్ష చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉషయ్య రాజిరెడ్డి అన్నారు. సోమవారం వారు దుబ్బాక పట్టణంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నవంబర్ 30న చలో దుబ్బాక కార్యక్రమానికి రైతన్నలు కదిలిరావలని పిలుపునిచ్చారు. రైతన్నల గొంతు ప్రగతి భవన్ కి వినిపించేలా దద్దరిల్లాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పక్ష పాతి అంటూ రైతన్నలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ధరణి పోర్టల్ రద్దు, తక్షణమే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ, గిరిజన రైతుల (పోడు భూముల) సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ధరణ పోర్టల్ పూర్తిగా కేసీఆర్ ఏజెన్సీగా మారిందన్నారు. దుబ్బాక పట్టణంలోని పోచమ్మ ఆలయం వద్ద ఈనెల 30న జరిగే చెరుకు శ్రీనివాస్ రెడ్డి దీక్ష ను జయప్రదం చేయాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 07:28PM