నవ తెలంగాణ-వేములవాడ
చెన్నమనేని రాజేశ్వరరావు...వేములవాడ సిరిసిల్ల ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దగా పరిచయం అక్కరలేని పేరు... ఆయన వారసుడు ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు. ఇతను కూడా రాష్ట్రంలో అందరికి సుపరిచితమే. అయితే వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలుగా మారాయి. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా జరుగుతున్న 7వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు. కీర్తిశేషులు చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే రమేష్ బాబు నిర్వహణలో జరుగుతున్న ఈ పోటీల్లో భాగంగా క్రీడా ప్రాంగణం ఆవరణలో రాజేశ్వరరావు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలోని ఓ ఫోటో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 2000 సంవత్సరంలో ఇదే వేదికగా కీర్తిశేషులు రాజేశ్వరరావు నిర్వహణలో సేవ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను రాజేశ్వరరావు పరిచయం చేసుకుంటున్న ఫోటో వైరలుగా మారింది. ఇదే క్రమంలో సరిగ్గా 22 ఏళ్ల తర్వాత అదే వేదికగా రమేష్ బాబు నిర్వహణలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తుండటం, కార్యక్రమంలో భాగంగా రమేష్ బాబు క్రీడాకారులను పరిచయం చేసుకోవడం చూసిన అక్కడ ఉన్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, క్రీడాకారులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. రమేష్ బాబును చూస్తే అచ్చం ఆనాటి రాజేశ్వరరావును చూసినట్లే ఉందని చర్చించుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 07:29PM