నవతెలంగాణ - అశ్వారావుపేట
విదేశీ ఆయిల్ ఫాం శాస్త్రవేత్తల బృందం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పలు ఆయిల్ ఫాం క్షేత్రాలను సోమవారం పరిశీలించింది. మలేషియా నుంచి ఫాం ఎలైట్ ఆసియా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నికోలస్ టర్న్ బుల్, ఫ్రాన్స్ కు చెంది సీ.ఐ.ఆర్డి శాస్త్రవేత్త డాక్టర్ స్యాల్విన్, థాయ్ ల్యాండ్ సియామ్ ఎలైట్ ఫాం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సరుత్ చోళథన్, టీఎస్ ఆయిల్ఫెడ్ కన్సల్టెంట్ బి. రాజశేఖరరెడ్డి, ఏపీ కన్సల్టెంట్ వైఎస్ రంగనాయకుల బృందం అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం, నారంవారిగూడెం,మద్దికొండ, దమ్మపేట మండలంలో మల్కారం,అల్లిపల్లి, మందలపల్లి లో 1993లో నుంచి 2000 సంవత్సరం వరకూ సాగు చేస్తున్న తోటలను పరిశీలించారు. అయివరీకోస్ట్ నుంచి తెచ్చి నాటిన రకాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఎంత దిగుబడి ఇస్తున్నాయి, తెగుళ్లు బెడద ఎలా ఉంది, తోటల ఎత్తు గెలలు సేకరణలో తలెత్తే ఇబ్బందులను పరిశీలించారు. అలాగే ఆనాడు తెచ్చిన పొట్టి రకాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. గ్యేనోడెర్మా తెగులు వ్యాప్తిని అధ్యయనం చేశారు. ఈ బృందం మరో వారం పాటు తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటించనుందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 07:31PM