నవతెలంగాణ-వేములవాడ
స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వేములవాడలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న 7వ రాష్ట్ర స్థాయి సీనియర్ వాలీబాల్ పోటీల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన లిక్యాంప్ ఫైర్లి వేడుకలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులు, క్రీడాకారిణిలతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు డాన్సులతో అలరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూప రాణి, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలమ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం హన్మండ్లు, సర్పంచ్ మంతెన సంతోష్, పార్టీ పట్టణ, రూరల్ మండలాల అధ్యక్షులు పుల్కం రాజు, గోస్కుల రవి, పట్టణ సీఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 12:41PM