- పోలీస్ కమీషనర్ కె ఆర్ నాగరాజు
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ / కామారెడ్డి జిల్లాలకు చెందిన పోలీస్ రిక్రూటుమెంటులో శారీరధారుఢ్య పరీక్షల కోసం ఎంపికైన అభ్యర్థులు తేది: 8-12-2022 నుండి ఉదయం 5 గంటలకు ప్రతీరోజు టౌన్ 5 పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారాం వద్దగల రాజారామ్ స్టేడియం లో హాజరుకావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు మంగళవారం ప్రకటనలో తెలిపారు. అందుకోసం పార్టు-2 కు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అడ్మిట్ కార్డులు లేదా ఇంటిమేషన్ లెటర్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొనే అవకాశం ఈ నెల తేది: 28-11-2022 నుండి తేది: 3-12-2022 రాత్రి 12 గంటల వరకు మండలి వెబ్ సైటు www.tslprb.in నుండి డౌన్లోడ్ చేసుకోగలరు అని తెలిపారు. తేది: 8-12-2022 నుండి శారీరదారుఢ్య పరీక్షల కోసం హాజరుకావాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్ తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm