నవతెలంగాణ-కంటేశ్వర్
గత రెండు సంవత్సరాలు గా రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ మెడికల్ బిల్లులు చెల్లింపు లో తీవ్ర జాప్యం జరుగుతున్నది అని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈవిల్ నారాయణ తెలిపారు. ఇండోర్, ఔట్ డోర్, ఫిక్స్డ్ మెడికల్ అలవెన్సెస్ (=ర 1000/-వితౌట్ ఓచర్ )2020నుండి పెండింగ్ లో ఉన్నాయి. ఏ ఐ బి డి పి ఏ ఇటీవల న్యూ ఢిల్లీ లో నిర్వహించిన చలో సంచారభవన్ వలన బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ మెడికల్ బిల్లులు చెల్లింపు కు ఫండ్స్ విడుదల చేసింది. దేవుడు వరమిచ్చినా, పూజారి ఇవ్వనట్టు జిల్లా ఆఫీస్ ల లో బిల్లుల చెల్లింపు కు చాలా ఆలస్యం చేస్తున్నారు. కనుక పెండింగ్ మెడికల్ బిల్లులు తక్షణమే చెల్లించాలనే, డిమాండ్ తో మంగళవారం 29-11-2 022న నిజామాబాద్ సంచార్ భవన్ లోని పీజీఎంబీఏ ఛాంబర్ లో ధర్నా ఉదయము 11.30గంటలకు నిర్వహించడం జరిగినది. ఈ ధర్నా కార్యక్రమం లో పాండురంగం, మధుసుాధన్, బాలస్వామి, గంగాధర్, మేహముాద్, ముత్తన్న, రిటైర్ ఉద్యోగులు తదితరులు పాల్గొనారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 03:46PM