- ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్
నవతెలంగాణ-కంటేశ్వర్
ద్విచక్ర వాహనదారులు త్రిచక్ర వాహనదారులు తూచా తప్పకుండా వాహనాలకు సంబంధించిన వాహన ద్రోపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ చందర్ రాథోడ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో బోధన్ బస్టాండ్ ప్రాంతంలో ద్విచక్ర వాహనదారులకు ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని పలు ప్రాంతాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఇతర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రంలోకి వచ్చే వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో విడుదల చేసిన నియమ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. నియమ నిబంధనలను పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే జరిమానాలను సైతం విధిస్తామని తెలిపారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లను ఉంచాలని లేనియెడల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్ తెలిపారు. ద్విచక్ర, త్రి వాహనదారులు వాహనాల నంబర్లను తొలగించిన నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
అందులో భాగంగానే సుమారు 30 మంది ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తూ 30 వాహనాలకు పైగా జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనాలు నడుపుతున్న వాహనాదారులు తప్పకుండా హెల్మెట్ ను ధరించాలని ఒకవేళ ప్రమాదాలకు గురైతే తనకు గాయాలపాలైనచో చాలా అనర్థాలు ఉంటాయని ఈ సందర్భంగా వాహనదారులకు గుర్తు చేశారు. కావున వాహనదారులు వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని అదేవిధంగా నంబర్ ప్లేట్లు తప్పనిసరిగా బైకు ఉంచాలని ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వాహన ద్రోపత్రాలను కూడా తప్పకుండా దగ్గరగా ఉంచుకోవాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో సుమారు 30 మంది ఆటో డ్రైవర్లు ద్విచక్ర వాహనదారులు తదితరులు తోపాటు ట్రాఫిక్ ఎస్ఐలు ఆర్ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 04:10PM