నవతెలంగాణ-కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పిఆర్సి బకాయిలను చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని, గ్రాట్యుటీ, సరండర్ లీవు, కమిటేషన్, సంవత్సరం దాటినా చెల్లించకపోవడం మూలన రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని మంగళవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ డరిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో వారు ఆరోపించారు. వీటికి తోడుగా బకాయి బడ్డ మూడు డి ఏ లు కూడా ఇవ్వకుండా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూ ఉద్యోగ వర్గాన్ని మభ్యపుస్తుందని వారు ఆరోపించారు. పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు కె. రామ్మోహన్రావు, ప్రధాన కార్యదర్శి సుధం మదన్మోహన్, ఉపాధ్యక్షులు ముత్తారం నరసింహస్వామి, నిజాంబాద్ డివిజన్ అధ్యక్షులు శిర్ప హనుమాన్లు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ ప్రసాద్ రావు, భోజన్న, రాధా కిషన్, సీర్ప లింగయ్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 04:12PM