తెలంగాణ రాష్ట్ర కమిటీ లో అశ్వారావుపేట కు స్థానం
సభ్యుడుగా రెండో సారి ఎన్నికైన పుల్లయ్య
నవతెలంగాణ - అశ్వారావుపేట
గత మూడు రోజులుగా నల్లొండ జిల్లా కేంద్రంలో మల్లు స్వరాజ్యం ప్రాంగణంలో జరిగిన ఏ.ఐ.కే.ఎస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం రెండో మహా సభలు బుధవారం ఘనంగా ముగిసాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ నూతన పాలక వర్గం లోనూ అశ్వారావుపేటకు స్థానం దక్కింది. అశ్వారావుపేట సర్పంచ్ గా రెండు పర్యాయిలు సేవలందించిన కొక్కెరపాటి పుల్లయ్య తిరిగి రెండో రాష్ట్రకమిటీ సభ్యుడుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈయన ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట గ్లోవర్స్ సొసైటీ వేదికగా ఆయిల్ ఫాం రైతులు సాగులో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు రైతులు పక్షాన పలు కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశం పై మహాసభల్లో రాజకీయ తీర్మానం సైతం ప్రతిపాదించారు. పుల్లయ్య రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తిరిగి ఎన్నిక అవడం పై పలు రైతు సంఘాలు నాయకులు, పార్టీల శ్రేణులు, బంధు మిత్రులు అభినందనలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 05:10PM