నవతెలంగాణ- తాడ్వాయి
ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి పిలుపునిచ్చారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో మహాసభలో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 13 నుంచి 16వ తేదీ వరకు మొదటిసారిగా జాతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభల్లో దేశంలో విద్యారంగంలో వస్తున్న మార్పులు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, యూనివర్సిటీలో పిహెచ్ డి విద్యార్థులకు ఫెలోషిప్ ను కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో విద్యార్థుల పరిశోధన నిలిచిపోయిందని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులు నాలుగు రోజులపాటు ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో చర్చలు జరిపి భవిష్యత్ కార్యచరణాన్ని రూపాందించనున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒలంపిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడం కోసం ఒక బలమైన తీర్మానాలు చేయబోతున్నాం అన్నారు.
అనంతరం భవిష్యత్తు కర్తవ్యాలతో దేశంలో ఒక బలమైన కార్యచరణ రూపొందించి ఉద్యమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఎస్ఎఫ్ఐ నిర్వహించే పోరాటాలకు, మహాసభల విజయవంతానికి విద్యార్థులు మేధావులు పేద వర్గాల ప్రజలందరూ ఆర్థిక సాయం సహకారాలు అందించి మహాసభల విజయవంతం కృషి చేయాలని కోరారు. బిజెపి ప్రభుత్వం యూనివర్సిటీలలో మతపరమైన ఘర్షణలు తీసుకొచ్చి విద్యార్థులకు మధ్య కలహాలు పెడుతున్నారు అన్నారు అలాంటి పరిస్థితులలో విద్యార్థులు అందరూ ఐక్యంగా సమస్యలను ఎదుర్కోవాలని, అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గూగులోత్ రమేష్, తరుణ్, రాజశేఖర్, సంపత్, గణేష్, శివ, కృష్ణ, అభిలాష్ శ్రీజ, కావ్య, సింధుజ, సంజన తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 05:12PM