- మండలాద్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షా దివాస్ మలుపుతిప్పిన రోజు చిరస్మరణీయమని టీఆర్ఎస్ మండలాద్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. మంగవారం మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ అద్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏఎంసీ చైర్మన్ రాజయ్య, సర్పంచ్ ద్యావనపల్లి మంజుల, సర్పంచులు పెంటమీదీ శ్రీనివాస్, పీఏసీఎస్ టీఏవైఎస్ మండలాద్యక్షుడు దీటీ బాలనర్స్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, బోనగిరి శ్రీనివాస్, ఘనపురం తిరుపతి, బిగుల్ల మోహన్, సుదర్శన్, శేఖర్ బాబు, వంగాల నరేశ్, గుభిరే మల్లేశం, కార్యకర్తలు పాల్గొన్నారు.