- నాగ పద్మజ. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జ్
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రతి మహిళ ఆర్థికంగా ఎంతో అభివృద్ధిని సాధించి ఇతరులకు మార్గదర్శకం కావాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జ్ మరియు డి ఆర్ డి ఓ. మండల స్పెషల్ ఆఫీసర్ నాగపద్మజ అన్నారు. మంగళవారం మండలంలోని పసర గ్రామంలో పీఎస్ఆర్ గార్డెన్స్ లో మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని కెనరా బ్యాంక్ పసర బ్రాంచ్ మేనేజర్ పూర్ణచందర్రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగ పద్మజ హాజరై మాట్లాడారు. ఒకప్పుడు ప్రతి కుటుంబము కుటుంబ పెద్ద సంపాదన పై ఆధారపడి జీవించేవారని ఇప్పుడు ఆ కుటుంబంలోని మహిళ ఆర్థిక అభివృద్ధితో ఆ కుటుంబం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. ప్రతి కుటుంబం కూడా ఆర్థిక అభివృద్ధిలో గృహిణి పాత్ర కీలకం అన్న విషయాన్ని ఇప్పటికే సమాజం గుర్తించిందన్నారు. మహిళా సంఘాలు ఏర్పడ్డ నాటి నుండి నీటి వరకు పొదుపును ప్రతి మహిళ నేర్చుకోవడం జరిగిందన్నారు. అనేక విషయాలను అవగాహన చేసుకునే శక్తి సామర్థ్యాలు నేడు మహిళలకు ఉన్నాయని అన్నారు. ప్రధానంగా కెనరా బ్యాంక్ వంటి బ్యాంకుల ద్వారా రుణము పొంది సద్వినియోగం చేసుకొని సకాలంలో కిస్తీలు చెల్లించి మరింత ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన పలు విధానాలను వివరించారు. కెనరా బ్యాంకు మీ బ్యాంక్ అని మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు మేము మా సిబ్బంది సహకారం ఎప్పుడూ ఉంటుందని బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఒక్కో గ్రూపుకు 20 లక్షల వరకు రుణ సహాయం అందిస్తాం. కె ఎస్ మాధవి కెనరా బ్యాంకు వరంగల్ రీజినల్ హెడ్.
ఒక్కొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూపుకు ఆ గ్రూపు ఆర్దిక లావాదేవీలను పరిశీలించి 20 లక్షల వరకు అతి తక్కువ వడ్డీతో ఎలాంటి ప్రాసెసింగ్ చార్జెస్ లేకుండా రుణ సౌకర్యం అందించేందుకు కెనరా బ్యాంకు ఎల్లవేళలా సిద్ధంగా ఉందని అన్నారు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించాలని సూచించారు. కెనరా బ్యాంకు ములుగు ఎల్డీఎం రాజకుమార్ మరియు బ్యాంకు మేనేజర్ పూర్ణచందర్ లు బ్యాంకు నుండి కొనసాగుతున్న పలు పథకాలను సంక్షేమ కార్యక్రమాలను సామాజిక కార్యక్రమాలను స్కీములను మహిళలకు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 05:36PM