- నగర అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల ఖర్చు పై శ్వేత పత్రంవిడుదల చేయాలి
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-కంటేశ్వర్
అధికార పార్టీ నేతల అభివృద్ధి మాట పెద్ద బూటకమని మిగులు బడ్జెట్లో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాలని కబ్జాదారులుగా టిఆర్ఎస్ నేతలు మారారని ఎన్నికల స్టంట్ గా వాగ్దానాలు మారాయని నగర అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలని టిఆర్ఎస్ నాయకులకు సవాలు చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ నేతలు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఎన్నికలు సమీపిస్తున్నందున మరోసారి బూటకపు మాటలతో ప్రజలను మోసం చేసేందుకు టిఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందన్నారు. టిఆర్ఎస్ నేతలకు దమ్ముంటే అభివృద్ధి కోసం 658 కోట్ల ఖర్చు పై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు భూకబ్జాదారులుగా మారారని ఆయన ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలోని 50 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ, పేదల స్థలాలతోపాటుదేవాలయాల భూములను కబ్జా చేశారని అన్నారు. అనేక భూములను కబ్జా చేసేందుకే ధరణి కార్యక్రమాన్ని చేపట్టారని ఈ పథకంలో అనేక లోపాలు ఉన్నాయన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అధికారుల హత్యలు జరుగుతున్నాయని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం టిఆర్ఎస్ నేతలే ధనికులుగా మారారని సామాన్య ప్రజలు మాత్రం ఆర్థిక ఇబ్బందులతో సాధారణ జీవితాలు గడుపుతున్నారని వెల్లడించారు. బంగారు తెలంగాణ కాలేజ్ కానీ కెసిఆర్ కుటుంబం బంగారు కుటుంబం గా మారిందన్నారు. టిఆర్ఎస్ ఏనిమిధిన్నర పాలనలో రాష్ట్రం పూర్తిగా దివాళ తీసిందన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ కెసిఆర్ అసమర్థత పాలనతో ఐదున్నర లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు. రాష్ట్రంలోని పుట్టిన బిడ్డ నుండి ప్రతి ఒక్కరిపై రెండు లక్షల అప్పు చేసిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెప్పుకోదగ్గ పరిశ్రమలు, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా ఏం సాధించారని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
గత కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల ,తెలంగాణ యూనివర్సిటీ లకు ఒక్క పైసా కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కీర్తి ప్రతిష్టతలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు కొలువుదీరిన జిల్లాలో క్రీడా స్టేడియం.లను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రాజారామ్ స్టేడియం ను అభివృద్ధి పరచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో మైనార్టీ బాలికల పాఠశాల, మహిళ కళాశాల ఏర్పాటు చేయడం లేదని, మహిళల గురించి కవిత ఏమాత్రం పట్టించుకోకుండా, అభివృద్ధి మంత్రంతో ప్రజలను మోసం చేయడం సమంజసం కాదన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లాగా పేరుగాంచిన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు రైతులకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటు ను మరచిపోయారని, పసుపు బోర్డు ఏర్పాటు పై బీ జే పీ ఎంపి విస్మరిస్తే కనీసం అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నారని టీఆర్ఎస్ రెండు పర్యాయాల కాలంలో ఇప్పటివరకు 30వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన పాపానా పోలేదన్నారు. జిల్లాలో ఒక ప్రాజెక్టు తీసుకురాలేదని కనీసం రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని రైతుబంధు పేరిట అన్నదాతలను మోసం చేస్తున్నారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పేరిట నిరుపేదలను మోసం చేసిన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానికి మిగిలిపోతుందన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఎంతోమంది యువకుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం పై నమ్మకంతో అధికారంలో నిలబెడితే రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మర్చి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారన్నారు.
కెసిఆర్ పాలనతో విసుకు చెందిన ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఎందుకు వచ్చిందని ఆవేదనలో ఉన్నారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గడుగు గంగాధర్, అర్బన్ నియోజకవర్గం ఇంచార్జ్ తాహెర్ బిన్ హందాన్ నగర అధ్యక్షులు కేశవేణు, మైల కాంగ్రెస్ నాయకురాలు తంబాకు చంద్రకళ,కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్, రత్నాకర్, రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 05:49PM