నవతెలంగాణ-గోవిందరావుపేట
టిపిసిసి ఆదేశాల మేరకు బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో కలెక్టర్కు ఇచ్చే వినతి పత్రం కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని పసర గ్రామంలో సీతారాం మీడియాతో మాట్లాడారు. బుధవారం ఉదయం 10 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నందు ధరణి పోర్టల్ రద్దు చేయాలని రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని రాష్ట్ర జిల్లా ముఖ్య నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు యూత్ నాయకులు మహిళలు ఎమ్మెల్యే సీతక్క అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీతారాం నాయక్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 05:51PM