- విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
- నిషిత కామర్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీలో వక్తలు వెల్లడి
నవతెలంగాణ-కంటేశ్వర్
తనపై తనకు నమ్మకంతోనే ముందుకు వెళ్లినప్పుడు విజయాలను సాధిస్తారని తెలంగాణ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ ఓ డి నందిని అన్నారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని శ్రావ్య గార్డెన్ లో నిషిత కామర్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ ఓ డి నందిని, గౌరవ అతిథిగా నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లింబాద్రి హాజరయ్యారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ తెలంగాణ యూనివర్సిటీ హెచ్ ఓ డి నందిని మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి క్రమశిక్షణతో చదువుకోవాలని అలాంటప్పుడే అనుకున్న విజయాలను సాధిస్తారని తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులు గురువులైతే పాఠశాలలో కళాశాలలో మొదటి గురువులు అధ్యాపకులను ఈ సందర్భంగా తెలిపారు. కావున పాఠశాలలో కళాశాలలో అధ్యాపకులు చెప్పేది మంచిగా విని తల్లిదండ్రుల పేరు నిలబెట్టేలా ఎదిగేలా కష్టపడి చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. అనంతరం గౌరవ అతిధి నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లింబాద్రి మాట్లాడుతూ కళాశాలలో ర్యాగింగ్ ను బ్యాండ్ చేయడం జరిగిందని ర్యాగింగ్ కు బదులు స్నేహపూర్వకంగా ఉండేందుకే ఇలాంటి ఫ్రెషర్స్ ఫేర్వెల్ పార్టీలను నిర్వహిస్తారని కానీ ఇతరుల పట్ల ఎప్పుడు కూడా తప్పులు చేయకూడదని ఆయన తెలిపారు. చిన్నచిన్న తప్పులు చేసి నేరాలకు పాల్పడుద్దని ఒక్క నేరం చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు తమకు రావని ఈ సందర్భంగా తప్పు చేయకుండా సరిగ్గా చదువుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులు విద్యార్థులు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని అలాగే తమతో పాటు తమ తల్లిదండ్రులకు కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు.
తప్పకుండా విద్యార్థిని విద్యార్థులు చట్టాలపై అవగాహన ఉంచుకొని చట్టం పరిధిలోని ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకునే బాధ్యత తమ పైననే ఉందని తెలిపారు. తప్పుచేసి బాధపడటం కంటే తప్పు చేయకుండా ఉండి తల్లిదండ్రులకు పేరు తెచ్చి పెట్టేలా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం కళాశాల విద్యార్థుల విద్యార్థులు చేసిన నృత్యాలు వీక్షకులందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నిషిత డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజు, డైరెక్టర్ ఓం షేక్, నిషిత కామర్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జయంత్ రెడ్డి, నిషిత డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ స్వప్న అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 05:54PM