- వైయస్సార్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షులు టేకుమట్ల విష్ణు
నవతెలంగాణ-ధర్మసాగర్
రాష్ట్రంలో గుండాగిరి చేస్తున్న తెలంగాణ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని వైయస్సార్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షులు టేకుమట్ల విష్ణు హెచ్చరించారు. నర్సంపేట్ నియోజకవర్గంలో వైస్సార్ తెలంగాణా పార్టీ అధినేత్రి శ్రీమతి వై.ఎస్ షర్మిళ చేస్తున్న ప్రజా ప్రస్థానం పాద యాత్ర ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు తెరాస పార్టీ గుండాలు పాద యాత్రను అడ్డుకోనీ, బస్సును తగలపెట్టడాన్ని నీరసిస్తూ మంగళవారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే దీష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు గూండాగిరి చేస్తే, అడ్డుకోని భద్రత కలిపిన్చాలిసినా పోలీసులు మా నాయకురాలును అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే, ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడకుండా, నిజాయితీ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పనిచేయాలని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమలో వైస్సార్ తెలంగాణా పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రావుల అనిల్ రెడ్డి, వైస్సార్ తెలంగాణా పార్టీ మండల నాయకులు నంగునూరు రాజు, కొలిపాక అనిల్, కొట్టే అనిల్ కుమార్, కళ్లెపు రాజు, ఎం.డి జనఁగీర్ పాషా, ఎం.డి రహిమోద్దీన్, చింతల రాజు, కొట్టే సునీల్, కనుకుంట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 05:57PM