నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రం శివారులోని 44వ జాతీయ రహదారి టోల్ ప్లాజా సమీపంలో మంగళవారం కారు వెనుక టైరు పగలడంతో ఒక్కసారిగా కారు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ రాజుకు గాయాలయ్యాయి. రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన రాజు పని నిమిత్తం తన స్నేహితుని కారు తీసుకొని హైదరాబాద్ వెళ్తుండగా స్థానిక టోల్ ప్లాజా సమీపానికి రాగానే వెనుకటైరు పగిలిపోవడంతో కారు రోడ్డు పక్కన బోల్తా పడి నుజ్జునుజ్జయింది. వెంటనే స్థానికులు గమనించి అందులో ఉన్న డ్రైవర్ రాజును సురక్షితంగా బయటకు లాగారు. అనంతరం పోలీసులు రాజును స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm