నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ కి చెందిన మొహ్మద్ గౌస్, ప్యారిబి దంపతులు వృద్ధాప్యంలో ఉండడం గౌస్ కు పక్షపాతం రావడంతో గ్రామ బిజెపి నాయకులు విషయాన్ని తెలుసుకుని, పెరిక సంఘ జిల్లా అధ్యక్షుడు పోతరాజు వెంకటేశ్ 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద కుటుంబ సభ్యులను గ్రామ ప్రజా ప్రతినిధులు పట్టించుకొని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి గ్రామ అద్యక్షులు అనిల్ కుమార్, మండల ఉపాధ్యక్షులు జోగు శివరాజ్, బూత్ అధ్యక్షులు దుబ్బరాజం, మధుసూధన్ రెడ్డి, తోగరి శివరాజ్ రాజలింగం, నరేందర్ గౌడ్, మాజిత్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm