నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిజివిపి నగర నాయకుడు అఖిల్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు మోకాళ్లపై నిల్చోని నిరసన తెలంగాణ విద్యార్థి పరిషత్(టిజివిపి) ఆధ్వర్యంలో ధర్న నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుండి 3800 కోట్ల పెండింగ్ ఫీ రేయంబస్మెంట్ విద్యార్థులకు అందిచక పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు చులకనగా చూస్తుంది విద్య వ్యవస్థ పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా ఉంది, విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితి ఉందని అన్నారు.
స్కాలర్షిప్ ఇవ్వకుండా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని, విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి సర్టిఫికెట్ ఇవ్వమంటే ఫీజులు అడుగుతున్న విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారు. వెంటనే ఈ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నితిన్, మనోజ్,కరుణాకర్, ప్రదీప్, మధు తేజ, రామ్, ప్రశాంత్, కొండూరు రామ్ సాయి రామ్, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Nov,2022 06:11PM